Mega 157: మళ్ళీ డ్యూయెట్స్ అంటాడేమో – మెగాస్టార్ కి హీరోయిన్ దొరకడం కష్టమే..!

Mega 157

మెగాస్టార్ చిరంజీవి, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ తో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కాకముందే అంచనాలను పెంచుతోంది. సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

చాలా రోజుల తర్వాత చిరంజీవి సోషియో ఫాంటసీ జానర్లో సినిమా చేస్తున్న నేపథ్యంలో జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి బ్లాక్ బస్టర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే, ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న మరో టాక్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలన్న అంశంపై సినిమా యూనిట్ చర్చలు జరుపుతోందని సమాచారం. చిరు సరసన మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే భోళాశంకర్ సినిమాలో తమన్నాతో చేసిన డ్యూయెట్ కి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో మళ్ళీ మృణాల్ ఠాకూర్ తో డ్యూయెట్స్ ప్లాన్ చేస్తే సినిమాకి మైనస్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

మరో పక్క, మెగా 157లో హీరోయిన్ గా నయనతార అనుష్కల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నయనతార ఇప్పటికే సైరా సినిమాలో చిరుకి జోడిగా కనిపించింది కాబట్టి ఈ సినిమాలో సెట్ అవుతుందని యూనిట్ అనుకుంటోందట. గాడ్ ఫాదర్ సినిమాలో చిరు, నయనతార అన్నా చెల్లెళ్లుగా కనిపించినప్పటికీ ఆ ఎఫెక్ట్ ఉండదని యూనిట్ భావిస్తోందట.

ఇక అనుష్క గతంలో స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్, సైరా సినిమాలో క్యామియోలో కనిపించింది పైగా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది కాబట్టి సినిమాకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. భోళాశంకర్ తో డిజాస్టర్ తర్వాత చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు