MEGA 157: చిరంజీవితో జతకట్టనున్న సీతారామం బ్యూటీ

MEGA 157

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తెలుగులో మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో అందరిని మెప్పించిన ఈ బ్యూటీ లేటెస్ట్ గా ఏకంగా మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిందని ఫిలిం నగర్ విధుల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా హాయ్ నాన్న చిత్రంలో నటిస్తోంది మృణాల్ ఠాకూర్. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదలవడానికి సిద్ధమవుతోంది. ఇక ఒక పక్క హాయ్ నాన్న చిత్రం షూటింగ్ దశలో ఉండగానే విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో రాబోయే సినిమాకు కూడా ఈ అమ్మడు డేట్స్ కేటాయించింది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

విజయ్ దేవరకొండ నాని లాంటి యంగ్ హీరోస్ తో  తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే మెగా స్టార్ చిరంజీవితో జత కట్టడానికి రెడీ అయింది. బింబిసార మూవీ ఫేం వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవబోతుంది. ఇక ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించడానికి మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఇటీవలనే డైరెక్టర్ వశిష్ఠ మృణాల్ ఠాకూర్ ను కలిసి కథ వినిపించగా ఆమె ఎగ్జైట్ అయ్యి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇప్పటికి వరకు యంగ్ హీరోల చిత్రాలలో నటించిన మృణాల్ ఠాకూర్ అంతలోనే సీనియర్ హీరోతో జతకట్టడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు