Bigg boss season7: పల్లవి ప్రశాంత్ విషయంలో క్లారిటీ ఇచ్చిన రతిక

Bigg boss season7

లేటెస్ట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అందరు ప్రేమ జంట అనుకుంటున్న రతిక, పల్లవి ప్రశాంత్ ల విషయంపై నిన్న జరిగిన ఎపిసోడ్ లో రతిక మొత్తానికి క్లారిటీ ఇచ్చింది. గత కొద్దీ రోజులుగా రతిక, పల్లవి ప్రశాంత్ హౌస్ లో క్లోజ్ గా ఉండటం మరియు రతిక విషయంలో ప్రశాంత్ ప్రతిసారి ఓవర్ గా రియాక్ట్ అవడం వలన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందని హౌస్ లో ఉన్న కంటిస్టెంట్స్ అంత అనుకుంటున్నారు. అలాగే బయట ప్రేక్షకులలో కూడా ఇదే విధంగా టాక్ వచ్చింది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో రతిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రతిఎపిసోడ్ ఎంటర్టైనింగ్ సాగుతుంది. ఇక ప్రతి సీజన్ లో సాధారణంగా జరిగే ప్రేమ వ్యవహారాలు ఈ సారి సీజన్ లో కాస్త ముందుగానే జరిగిందని చెప్పవచ్చు. రైతు బిడ్డ అంటూ హౌస్ లోకి ఎంటరైన ప్రశాంత్.. హౌస్ లోకి వెళ్లిన తరువాత నుంచి మాత్రం రతిక అనే కంటిస్టెంట్ తో ప్రేమ వ్యవహారం నడపడం మొదలు పెట్టాడు. ఇక ఈ వ్యవహారం రోజు రోజుకు ముదురుతూ వస్తుండటంతో రతిక.. పల్లవి ప్రశాంత్ షో కోసం ఇలా చేస్తున్నాడని కంటిస్టెంట్ శోభా శ్రీ తో చెప్పుకొచ్చింది.

అలాగే పల్లవి ప్రశాంత్ ను తాను కేవలం ఫ్రెండ్ గానే చేస్తున్నాని, ప్రశాంత్ ఏ కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతున్నడని తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టింది రతిక. దింతో ప్రశాంత్ పై రతిక కు ఎలాంటి ప్రేమ ఉద్దేశ్యం లేదనే విషయం స్పష్టమైంది. అయితే మరి రతిక విషయంలో రోజురోజుకు ఫీలింగ్స్ పెంచుకుంటున్న పల్లవి ప్రశాంత్ పరిస్థితి ఏంటనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు