Mega 156: చిరు కళ్యాణ్ కృష్ణ సినిమా లేనట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని చాలా కాలంగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయినట్టే అని కూడా టాక్ వచ్చింది ఆ మధ్య. అయితే, భోళా శంకర్ ఘోర డిజాస్టర్ గా మిగిల్చిన నేపథ్యంలో రీమేక్స్ విషయంలో చిరు పునరాలోచనలో పడ్డారని సమాచారం అందుతోంది.
అయితే, కళ్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమా కూడా రీమేక్ అని వార్తలొచ్చిన నేపథ్యంలో ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వటం అనుమానమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో Mega 157 సినిమాను అనౌన్స్ కూడా చేయటంతో కళ్యాణ్ కృష్ణ సినిమా విషయంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది.
వశిష్ఠతో చేయబోయే సినిమా సోషియో ఫాంటసీ కావటంతో సినిమా పూర్తవటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో కళ్యాణ్ కృష్ణతో రీమేక్  కాకుండా ఒరిజినల్ కథతో సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది. చిరంజీవి మిడిల్ ఏజ్ క్యారెక్టర్లో కనిపించబోయే ఈ సినిమాలో చిరుకి కొడుకు క్యారెక్టర్లో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించనున్నాడని వార్తలొచ్చాయి.
ఆ తర్వాత సిద్దు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనీ శర్వానంద్ ఈ క్యారెక్టర్లో కనిపిస్తాడని టాక్ వినిపించింది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా కనిపించనుందని వార్తలొచ్చిన నేపథ్యంలో సినిమాపై హోప్స్ క్రియేట్ అయ్యాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు