Miss Shetty Mr Polishetty: అనుష్క పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఈమెనే..!!

Miss Shetty Mr Polishetty

జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి – అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి”. ఈ చిత్రం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈ సినిమా చూసిన జనాలు రివ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే మూవీకి కొంత మేరకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పటికే ఈ సినిమా హిట్, ఫ్లాప్ అనేది అంచనాలు వేయడం కష్టం. ఈ సినిమా కోసం వీరిద్దరూ కూడా రెండేళ్ల సమయాన్ని కేటాయించారు. పి మహేష్ బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రంలో అనుష్క ఓ వెరైటీ పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. పెళ్లి వద్దు కానీ పిల్లల్ని మాత్రం కంటాను అంటూ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించింది అనుష్క. అలాగే ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా వర్కౌట్ అయింది. నవీన్ పొలిశెట్టి – అనుష్కల కామెడీ టైమింగ్ మరింత అద్భుతంగా ఉండడం సినిమాకి ప్లస్ అయ్యింది. అయితే నిజానికి ఈ సినిమాలోని అనుష్క పాత్ర కోసం ముందుగా హీరోయిన్ రష్మిక మందన్న ఎంచుకున్నారట డైరెక్టర్ మహేష్.

అయితే నవీన్ పోలిశెట్టి లాంటి చిన్న హీరోతో ఆమెకు నటించడం ఇష్టం లేక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట రష్మిక. అంతేకాకుండా ఆ పాత్ర రోల్ చాలా చిన్నగా ఉందని.. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఇలాంటి చీప్ రోల్స్ లో కనిపిస్తే జనాలు లైక్ చెయ్యకపోగా.. కెరీర్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్న ఆలోచనలతో ఈ ఆఫర్ ని తిరస్కరించిందట రష్మిక. ఈ సినిమా ఇప్పుడు మంచి విజయాన్ని సాధిస్తే రష్మిక ఓ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయినట్లేనని అంటున్నారు నెటిజెన్స్.

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు