S. S. Rajamouli : ఈ వయసులో మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న..?

S. S. Rajamouli

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి. అంతేకాదు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు కథానాయకుడిగా ఓ సినిమాని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతోంది.

ఇదిలా ఉంటే.. రాజమౌళి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రాజమౌళి ఈ వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్నారని. రాజమౌళికి ఇప్పటికే కార్తికేయ అనే అబ్బాయి ఉన్నాడు. అతను రాజమౌళి భార్య రమాదేవికి మొదటి భర్త ద్వారా పుట్టిన వారు. ఆమె భర్తతో విభేదాలు రావడంతో విడిపోవడం జరిగింది. అలా కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న ఆమెను రాజమౌళి వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు వీరికి పిల్లలు లేరు.

కానీ వీరు మాయక అనే ఒక చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా రాజమౌళి మరొక అమ్మాయిని కూడా దత్తత తీసుకొని మరోసారి తండ్రి కాబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. గతంలో అనుకున్నట్లు ఇద్దరు అనాధలను దత్తత తీసుకోవాలనుకున్న ప్రకారమే ఇప్పుడు రెండవ పాపని కూడా దత్తత తీసుకున్నారట రాజమౌళి. ఈ వార్త విన్న వారందరూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు