Prabhas And Rajamouli: జక్కన్న – డార్లింగ్ పార్ట్‌నర్స్… ఓవర్సీస్‌లో బిగ్ ప్లాన్?

Prabhas And Rajamouli

బాహుబలి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్స్ అందుకోవటమే కాకుండా టాలీవుడ్ రేంజ్ ని పాన్ ఇండియా స్థాయికి వ్యాపింపజేశారు రాజమౌళి, ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే, జక్కన RRR సినిమాతో ఆస్కార్ రేంజ్ కి ఎదిగి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సాధించాడు.

సినిమాల్లో క్లిక్ అయిన ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ఇప్పుడు మరొక మాస్టర్ ప్లాన్ తో వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి ప్రభాస్ లు కలిసి ఓవర్సీస్‌లో భారీ ప్లాన్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందుకోసం కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇద్దరు సై అంటున్నారు. త్వరలోనే ప్రభాస్ – రాజమౌళి దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఆ మధ్య ప్రభాస్ కి తన హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ తో విభేదాలు తలెత్తాయని వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ లో వాస్తవం ఉండే ఉంటుందని అనిపిస్తోంది. యువి సంస్థ రామ్ చరణ్ తో కలిసి వీ మెగా పిక్చర్స్ బ్యానర్ స్థాపించటం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. మరి, ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన రాజమౌళి, ప్రభాస్ లు ఎలాంటి టాలీవుడ్ సినిమాలకే పరిమితం అవుతారా లేక గ్లోబల్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

- Advertisement -

మంచి కంటెంట్ ఉన్న కంటెంట్ ఉన్న టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ బాహుబలి ద్వయం తీసుకున్న డెసిషన్ లాభాలు తెచ్చి పెట్టే విధంగా ఉందని టాక్ వినిపిస్తోంది. మరి, ఒకరి తర్వాత ఒకరు హీరోలంతా ప్రొడక్షన్ వైపు అడుగులేస్తున్న తరుణంలో ఈ ట్రెండ్ టాలీవుడ్ కి ఏ మేరకు హెల్ప్ అవుతుంది అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు