Megastar Chiranjeevi: జడ్జిమెంట్ ఏమైంది బాసూ..?

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పేరు కాదు ఇది. శివ శంకర్ వర ప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఆయన  ప్రయాణం ఎందరికో ఆదర్శం.కష్టం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి. ఈ ఏజ్ లో కూడా అంత స్టార్డం వచ్చినప్పటికి ఇంకా సినిమా కోసం మెగాస్టార్ కష్టపడుతున్నారు అంటే అది మాములు విషయం కాదు.

ఇదంతా మెగాస్టార్ తన అభిమానులను అలరించడానికే చేస్తున్నాను  అని తరచూ చెబుతూ ఉంటారు. కానీ మెగాస్టార్ నిజంగానే అభిమానులను అలరిస్తున్నారా.?, సహనానికి పరీక్షా పెడుతున్నారా?.  అసలు అన్నయ్య జడ్జ్ మెంట్ ఏమైంది.

చిరంజీవి సినిమాలలో ఒకప్పుడు కష్టం ఉంది, కన్నీరు ఉంది , వినోదం ఉంది , డాన్స్ లు ఉన్నాయి, కొల్ల గొట్టిన రికార్డ్స్ ఉన్నాయి, కర్చీఫ్ వేసిన నెంబర్ ఒన్ స్థానం ఉంది. మరి ఇప్పుడు.? వరుస సినిమాలు వస్తున్నాయి. నిరాశ పరుస్తున్నాయి. బచ్చా గాడికి కూడా విమర్శలు చేసే అవకాశం ఇస్తున్నాయి.ఒకప్పుడు చాలామందికి చిరంజీవి సినిమాలతో అనుభవాలు ఉన్నాయ్ , అనుభూతులు ఉన్నాయ్ , జ్ఞాపకాలు ఉన్నాయ్.ఇప్పుడు మాత్రం నిరాశ, నిస్పృహలు ఉన్నాయ్.

- Advertisement -

ఖైదీ , కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి , ఘరానా మొగుడు వంటి కమర్షియల్ సినిమాలతో పాటు స్వయంకృషి , రుద్రవీణ వంటి  సామాజిక స్ప్రుహ ఉన్న సినిమాలు చేసి, ఇంద్ర తో అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసిన ఘనత చిరంజీవిది.

చిరంజీవి పదేళ్లు సినిమాకి గ్యాప్ ఇచ్చినప్పటికీ సింహాసనం ఖాళీగానే ఉంది. ఎందుకంటే ఆ స్థానం ఎప్పటికి రాజుదే కాబట్టి. ఆ రాజు చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీమేక్ తో రీ ఎంట్రీ ఇచ్చిన కూడా  రీ సౌండ్ గట్టిగానే వినిపించింది. కానీ “వాల్తేరు వీరయ్య” మినహా ఇప్పుడు వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకున్నాయా అంటే దానికి సమాధానం పెదవి విరుపే.

మెగాస్టార్ ఇదివరకే కొంతమంది డైరెక్టర్స్ తో అధికారికంగా సినిమాను చేస్తాను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటో జానీ అనే టైటిల్ తో పూరి జగన్నాధ్ తో సినిమా చేస్తున్నట్లు , డీవివి దానయ్య నిర్మాణంలో త్రివిక్రంతో సినిమా చేస్తున్నట్లు స్వయంగా చిరంజీవి ప్రకటించినవే.

కానీ ఏ సినిమాలు పట్టాలెక్కలేదు. చిరంజీవి అనుకుంటే మంచి యంగ్ టాలెంట్ డైరెక్టర్స్ క్యూ లో ఉన్నారు. చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించే సత్తా ఉన్న దర్శకులు ఉన్నారు. అలానే సక్సెస్ అయ్యాడు దర్శకుడు బాబీ.  సందీప్ రెడ్డి వంగ , హరీష్ శంకర్ వంటి డైరెక్టర్స్ కి చిరంజీవి ఒక్క అవకాశం ఇస్తే అద్భుతమైన సినిమాలను తీయగలరు.

ప్రపంచం రోజుకో రంగు పులుముకుని ముందుకుపోతున్న ఈ తరుణంలో ఇంకా రీమేక్ సినిమాలు మాకు ఇవ్వడం ఎందుకు బాస్, ఒకప్పుడు అయితే వేరే భాషలో రిలీజైన సినిమా చూసే అవకాశం దొరికేది కాదు. కానీ ఇప్పుడు సినిమా ఇంట్లో ఉంది. ఇప్పుడు ప్రేక్షకుడు థియేటర్ కి రావాలంటే మాకు పాత చిరంజీవి కావాలి కానీ పాత చిరంజీవిని ఇమిటేట్ చేసే చిరంజీవి వద్దు. దానికి కథలు విషయంలో మీ జడ్జిమెంట్ మారాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు