#HBDMegastarChiranjeevi: ‘గ్రేసు’ గుర్రానికి 68 ఏళ్ళు..!

#HBDMegastarChiranjeevi

‘కొణిదెల శివశంకర వరప్రసాద్’ పునాదిరాళ్ళు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మిడిల్ క్లాస్ యువకుడు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కోటానుకోట్ల మంది అభిమానుల అన్నయ్యగా, మెగాస్టార్ గా, టాలీవుడ్ ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. సినిమానే శ్వాసగా జీవించి ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిన కష్టజీవి అతను. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి హీరోగా మారి అప్పటి దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటుగా డ్యాన్స్, ఫైట్స్ లో ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు మెగాస్టార్. ఒకానొక సందర్భంలో మూడు షిఫ్ట్స్ లో నటించి గ్యాప్ లేకుండా సినిమాలు చేసి, ఇండియాలో కోటిరూపాయల రెమ్యునరేషన్ గా తీసుకున్న ఫస్ట్ యాక్టర్ గా బిగ్గర్ ద్యాన్ బచ్చన్ గా నిలిచాడు.

తనకు మాత్రమే సొంతమైన గ్రెస్ తో చిరంజీవి చేసే డ్యాన్స్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరో చేయలేదనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎటువంటి ఎక్సప్రెషన్ అయినా అద్భుతంగా పలికించగల కళ్ళు చిరుకి సొంతం. వరుస ఇండస్ట్రీ హిట్స్ తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ తన రికార్డులు తానే తిరగరాశాడు మెగాస్టార్. ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయటమే కాకుండా వారిని రక్తదానం, నేత్రదానం వంటి సేవ కార్యక్రమాల వైపు నడిపించి ఇతర హీరోలకు స్ఫూర్తిగా నిలిచాడు. అభిమానులంటే కటౌట్ లు, పూలదండలు, పాలాభిషేకాలకు మాత్రమే పరిమితం కాకూడదని బాధ్యత గల పౌరులుగా ఉండాలని ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.

టాలీవుడ్ ని నంబర్ వన్ గా శాసిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి ఎంటరై సుమారు 9ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నంబర్ 150 సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరి ఎప్పటికి తానే నంబర్ వన్ అని ప్రూవ్ చేశాడు. ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోస్ గట్టి పోటీ ఇస్తున్న మెగాస్టార్ కి Filmify పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు