Extra movie update : నితిన్ సినిమాలో క్యామియో లో కనిపించబోతున్న అల్లు అర్జున్

Extra movie update

యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ గా కనిపించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తోన్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.

అయితే నితిన్ ఈ సినిమాలో.. . సినిమాలంటే పడి చచ్చిపోయే ఒక జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నరని టాక్. విలేజ్ నుంచి సినిమాల మీద వ్యామోహంతో సిటీ కి వచ్చే ఒక కుర్రాడి పాత్రలో నితిన్ జర్నీ ఆసక్తికరంగా ఉండబోతుందట. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా చివరిలో వచ్చే ఒక చిన్న క్యామియోలో కనిపించబోతున్నట్టు ఒక వార్త వినిపిస్తోంది. అయితే ముందుగా ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట కానీ ప్రస్తుతం ఆయన తన సొంత సినిమాలు మరియు పొలిటికల్ గా బిజీ గా ఉండటం వల్ల బన్నీ ని తీసుకుందామని వక్కంతం వంశీ ప్లాన్ చేస్తున్నరని సమాచారం అందుతోంది.

గతంలో వక్కంతం వంశీ, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేసారు. దాంతో బన్నీకి వంశీ కి మంచి ర్యాపొ ఉంది. దానికి తోడు పుష్ప సినిమాపై ఉన్న బజ్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు కలిసొస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవలనే ఈ సినిమా నుంచి రిలీజైన డేంజర్ పిల్లా అనే సాంగ్ అందరిని ఆకట్టుకోవడంతో త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు