KUSHI : తమిళ గడ్డ పై చిరంజీవి పేరు గట్టిగ వినిపించేలా చేసిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda about chiranjeevi

హైదరాబాద్ లో జరిగే ఆడియో లాంచ్ ఫంక్షన్ లలో ప్రి రిలీజ్ ఈవెంట్ లలో మెగా స్టార్ చిరంజీవిని ఎవరైన పొగుడుతారు. కానీ పక్క రాష్టం వెళ్లిన కూడా అదే ప్రేమ ని చూపించేవాడికే ఒక రేంజ్ ఉంటది అనేటట్టుగా ఉంది విజయ్ దేవరకొండ చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలు చూస్తే..

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రతి స్టేట్ కు వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ నిన్న సాయత్రం చెన్నై లో ఖుషి సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొని, తమిళ్ మీడియా ముందు చిరంజీవి గొప్పతనాన్ని చెప్పి.. అందరు ముక్కు మీద వేలు వేసుకునేల చేసాడు.

చిరంజీవి భోళా శంకర్ సినిమా తమిళ్ లో వేదాళం రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఈ విషయాన్ని మీరెలా చూస్తారంటూ తమిళ్ విలేకరి విజయ్ ను ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ లు సూపర్ స్టార్స్.. వాళ్ళు చూడని హిట్స్ ఫ్లాప్ లు అంటూ లేవు… రజినీకాంత్, కమల్ హాసన్ లకు సీరియల్ 6 ఫ్లాప్ లు వచ్చిన విక్రమ్, జైలర్ సినిమాలతో వాళ్ళు సూపర్ హిట్స్ కొట్టారు. అలాగే చిరంజీవి కూడా లాస్ట్ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమాతో అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసారు. వాళ్ళ స్టామినా అలాంటిది.

- Advertisement -

కరెక్ట్ డైరెక్టర్ తో వాళ్ళు గనక కోలాబిరేట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటాడో అందరం చూస్తూనే ఉన్నామంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ విషయానికొస్తే చిరంజీవి లాంటి హీరో లేనే లేడు. డాన్స్ లో, ఫైట్స్ లో అన్నింటిలో ఆయన క్రియేట్ చేసిన స్టైల్ వేరు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద ఎకో సిస్టమ్ ను ఆయన క్రియేట్ చేసాడు. ఆయనే గనక లేకపోయుంటే అసలు నేను కూడా ఒక యాక్టర్ మీ ముందు నిలబడేవాన్ని కాదు అని విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చాడు. కాగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ చిరంజీవి గురించి అందరి ముందు గొప్పగా మాట్లాడటం మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ ను తీసుకొచ్చింది. కానీ విజయ్ రజినీకాంత్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని అన్నందుకు గాను కోలీవుడ్ ప్రేక్షకులు కొంతవరకు విజయ్ పై నెగిటివ్ గా ఉన్నారని తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు