Prabhas’s Salaar: అక్కడ సలార్ క్రేజ్ మాములుగా లేదు..!

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ ఇదివరకే రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచగా ఫ్యాన్స్ తో సహా నార్మల్ ఆడియెన్స్ లో కూడా సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న ఈ సినిమా 1000కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ క్రమంలో రిలీజ్ కి ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉండగానే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 వేల డాలర్లకు పైగా వసూలు చేసిందని టాక్ సమాచారం అందుతోంది. ఐడియాన్ సినిమా హిస్టరీలోనే యూఎస్ లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న సలార్ కొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి డిజాస్టర్స్ వచ్చిన క్రమంలో సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం కీలకంగా మారింది.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో సలార్ కి కూడా కెజిఎఫ్ సినిమాతో లింక్ ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గ్లిమ్ప్స్ వీడియో లో కూడా కెజిఎఫ్ కి లింక్ ఉన్నట్టు సంకేతాలు ఉండటంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి, రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ద్వారా ప్రభాస్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు