Mama Maschindra: సలార్ పోస్ట్ పోన్ – సుధీర్ బాబుకి వర్కౌట్ అవుతుందా..?

Mama Maschindra

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సలార్ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందన్న వార్తలు గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేనప్పటికీ రిలీజ్ దగ్గరపడుతున్న తరుణంలో ప్రమోషన్స్ ఊసు కూడా లేకపోవటంతో సలార్ పోస్ట్ పోన్ అన్నది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయినట్టే.

ఈ నేపథ్యంలో సలార్ రిలీజ్ దృష్టిలో పెట్టుకొని హోల్డ్ లో ఉన్న సినిమాలన్నీ వరుసగా ఒక్కొక్కటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాయి. ఆ రకంగా ఈ నెలాఖరుకి థియేటర్స్ అన్నీ చిన్న, మీడియం సైజ్ సినిమాలతో నిండిపోయాయి.

ఆ తర్వాత దసరా వరకు చాలా గ్యాప్ ఉండటంతో హీరో సుధీర్ బాబు ఆ గ్యాప్ ఫిల్ చేసేయాలని డిసైడ్ అయ్యాడు. హర్షవర్ధన్ డైరెక్షన్లో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఈ మధ్య కాలంలో సుధీర్ బాబు సినిమాలు వరుసగా రిలీజ్ అయినప్పటికీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ అనిపించుకోలేదు.

- Advertisement -

ఈ క్రమంలో మామా మశ్చీంద్ర సినిమా హిట్ అవ్వటం సుధీర్ బాబుకి కీలకంగా మారింది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ లో కనిపిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. హర్ష వర్ధన్ గతంలో రైటర్ గా మంచి హిట్స్ అందుకున్న క్రమంలో ఫస్ట్ టైమ్ ఈ సినిమాకి డైరెక్టర్ గా మారిన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి, సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు