Pawan Kalyan: ఏందయ్యా ఇది..పవన్‌ కోసం పవిత్ర ఆంటీ !

pavitra lokesh supports pawan kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు తెగించి పోరాడేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఇప్పటికే జబర్దస్త్ నుంచి అలాగే సినిమా ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో కృష్ణ గారి కొడుకులు నరేష్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. జనసేనకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు నరేష్. ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటు అయిన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిరమైన మద్దతుదారునిగా కొనసాగుతా అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేయాలని.. పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలుస్తారని నరేష్ ఆశ భావం వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా సీనియర్ నటుడు నరేష్…పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకడంతో… ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు నేటిజన్స్. నరేష్ మద్దతు పలికాడు కదా… నటి పవిత్ర లోకేష్ ను కూడా బర్లోకి దింపాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో పవిత్ర లోకేష్ ప్రచారం చేయాలని కోరుతున్నారు. దీంతో మరోసారి నరేష్ మరియు పవిత్ర లోకేష్ అంశం తెరపైకి వచ్చింది. కాగా గత కొన్ని రోజులుగా నరేష్ మరియు పవిత్ర లోకేష్ రిలేషన్స్ లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు