Nagarjuna Movie: హీరోయిన్‌ని అక్కడ గట్టిగా కొరికిన నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఎదిగిన అక్కినేని నాగార్జున గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. నవమన్మధుడిగా, యువ సామ్రాట్‌గా, కింగ్‌గా, గ్రీకువీరుడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, ఎందరో అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా ఉన్న నాగార్జున ఇప్పటికీ కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు నాగార్జున.

ఈ హీరో ఎంతోమంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ టబుతో నాగార్జునకి ఎఫైర్ ఉందని ఇప్పటికీ ఎన్నో వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ నాగార్జున చివరికి అమలను రెండో వివాహం చేసుకున్నారు. ఇక టబు ఐదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. ఈమె సింగిల్‌గా ఉండటానికి కారణం.. నాగార్జుననే అని ఓ టాక్ కూడా ఉంది.

ఇక టబు – నాగార్జున కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సూపర్ హిట్ అయింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున టబుని కొరికే ఒక సన్నివేశం ఉంటుంది. ఈ సందర్భంలోనే నాగ్ కాస్త టెంప్ట్ అయిపోయి ఆమెను గట్టిగా కొరికారట.

- Advertisement -

దీంతో టబు గట్టిగా అరిచిందట. ఈ సీన్ బాగా వచ్చినప్పటికీ టబుని కొరికితే ఆమెకు అక్కడ గాట్లు కూడా పడ్డాయట. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు