Pooja Hegde: కష్టాలను మరచి… సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న బుట్టబొమ్మ

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతుంది. రాధేశ్యామ్ నుంచి ఇటీవల వచ్చిన కిసి కా భాయ్ కిసి గా జాన్ చిత్రం వరకు పూజా వరుసగా 5 ఫ్లాప్స్ ను తన కెరీర్ లో వేసుకుంది. దీనికి తోడు.. గుంటూరు కారం నుంచి తప్పించడం, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా తప్పించారనే వార్తలు రావడంతో పూజా కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పూజా తన 33వ బర్త్ డే ని జరుపుకుంటుంది.

అయితే ఈ కష్టాలన్నీ మరచి తన బర్త్ డేని జరుపుకుంటుంది పూజా హెగ్డే. తన ఇన్ స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఓ వీడియోని షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున రిలాక్స్ అవుతుంది. ఈ వీడియోను చూసి.. అన్ని మరచిపోయి ప్రశాంతంగా తన బర్త్ డేని సెలబ్రెట్ చేసుకోవడానికి ఒంటరిగా వెళ్లిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం.. అచ్చి రాని సినిమాలను పక్కన పెట్టి తన భాయ్ ఫ్రెండ్ తో బర్త్ డే సెలబ్రెట్ చేసుకోవడానికి బీచ్ కి పోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాదు, పూజా వీడియో తీసింది ఆ భాయ్ ఫ్రెండ్ అని అంటున్నారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి పూజా లవ్ లో పడింది అంటూ గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఓ ఇండియన్ క్రికెటర్ తో పూజా సహజీవనం చేస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ, వీటిపై పూజా సన్నిహితులు స్పందించడంతో ప్రస్తుతం ఓ బాలీవుడ్ హీరోతో పూజా లవ్ ట్రాక్ లో ఉందని, ఈ జంట చట్టాపట్టాలేసుకుని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ బాలీవుడ్ మీడియా రాసుకొస్తుంది. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, పూజా మాత్రం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి… మిస్ అయ్యాయి అనే టెన్షన్ లేకుండా సముద్రంలో మాత్రం ఎంజాయ్ చేస్తుంది అనేది మాత్రం నిజం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు