Nagarjuna: 100వ సినిమా కోసం నాగార్జున పక్కా ప్లాన్ – బట్ చాలా లేట్..!

Nagarjuna

గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు హీరో నాగార్జున. నాగార్జున గత చిత్రం ఘోస్ట్ సహా అఖిల్ ఏజెంట్, నాగచైతన్య కస్టడీ కూడా తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో నాగార్జున నెక్స్ట్ మూవీ హిట్ అవ్వటం కీలకంగా మారింది. నాగార్జున 99వ సినిమా నా సామిరంగా సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలై ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా నాగార్జున 100వ సినిమా చిరంజీవి గాడ్ ఫాదర్ డైరెక్టర్  మోహన్ రాజా డైరెక్షన్లో చేయనున్నట్లు అప్పట్లో టాక్ వినిపించింది. అయితే, గాడ్ ఫాదర్ సినిమా ఆశించిన స్థాయిలో అలరించని కారణంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు.

అఖిల్, నాగచైతన్యలకు కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ ఉండేలాగా మోహన్ రాజా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని కూడా ఆ మధ్య టాక్ వినిపించింది. ఆ తర్వాత మోహన్ రాజా తని ఒరువన్ సీక్వెల్ స్టార్ట్ చేయటం నాగార్జున మరో సినిమా కమిట్ అవ్వటంతో ఈ సినిమా స్టార్ట్  అవ్వటానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

అంతే కాకుండా మహేష్, రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు నాగార్జున. ఈ సినిమా స్టార్ట్ అవ్వటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా 101 అయ్యే ఛాన్స్ ఉంది. మరి, పక్కా ప్లానింగ్ తో వస్తోన్న 100వ సినిమా ద్వారా నాగార్జునకి బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా అన్నది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు