Nagarjuna: ఎవర్ గ్రీన్ పెయిర్ మళ్ళీ కలుస్తారా..?

అక్కినేని నాగార్జున, హీరోయిన్ టబు ల పెయిర్ అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో ఇప్పటికీ ఈ జంటని బీట్ చేసే పెయిర్ రాలేదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరిద్దరూ కలిసి నటించిన నిన్నే పెళ్లాడతా సినిమా ఇప్పటికీ టీవిలో వస్తే వదలకుండా చూసేవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాగార్జున నెక్స్ట్ సినిమా ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో కమిట్ అయినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం నాగార్జున టబుని హీరోయిన్ గా సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

నాగార్జున మేరకు దర్శకుడు టబును సంప్రదించి ఈ ప్రపోజల్ తన ముందు ఉంచాడని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ ప్రపోజల్ కి టబు రెస్పాన్స్ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ టబు ఈ అఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక ఫ్యాన్స్ కి పండగే  చెప్పచ్చు. ప్రస్తుతం అజయ్ మంగళవారం సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ తర్వాత నాగార్జునతో చేయబోయే సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో అజయ్ నాగార్జున కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు, ఎవర్ గ్రీన్ పెయిర్ ని తెరపై ఎలా చూపించబోతున్నాడు వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది. గతేడాది వచ్చిన బంగార్రాజు సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్న నాగార్జునకి ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేని క్రమంలో ఈ కాంబినేషన్ పైనే ఆశలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. మరి, వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా ద్వారా అయినా హిట్ దక్కుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు