VD13: విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదు..

“గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని” కేజిఎఫ్ సినిమాలో అనంత్ నాగ్ చెప్పిన డైలాగ్ లాగా ఉంది విజయ్ దేవరకొండ కెరీర్ చూస్తుంటే. గతేడాది ఈ యంగ్ హీరో నటించిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై, ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన విషయం అందరికి తెలిసిందే. కానీ అయిన కూడా విజయ్ దేవరకొండకు దూకుడు మాత్రం ఇంకా పెరిగిందే తప్ప అస్సలు తగ్గటం లేదనే చెప్పాలి.

మజిలీ సినిమా ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇప్పటికే ఖుషి సినిమా షూటింగ్ కంప్లిట్ చేసిన విజయ్ వచ్చే సెప్టెంబర్1న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. అయితే ఇటీవలనే సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నట్టు వస్తోన్న రూమర్స్ నేపథ్యంలో, ఈ రూమర్ గనక నిజం అయితే ప్రస్తుతం ఆమె విజయ్ తో చేస్తున్న ఖుషి సినిమానే లాస్ట్ సినిమా అవుతుంది. ఇక సమంత విషయం అటు పక్కన పెట్టి విజయ్ గురించి మాట్లాడుకుంటే ఖుషి సినిమా షూటింగ్ లో ఉండగానే మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు విజయ్.

ఇటీవలనే జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్న విజయ్, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. గీత గోవిందం సినిమాతో హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ- పరుశురాం కలిసి సినిమా చేయబోతున్న సినిమా ఇటీవలనే లాంచ్ అవ్వగా, ఈ సినిమా లొకేషన్ హంట్ కూడా మూవీ యూనిట్ కంప్లిట్ చేసి, తొందర్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని అప్డేట్ ఇచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గాను ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే విజయ్ జనాలు లైగర్ సినిమాని మర్చిపోయేలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు