Game chenger: ఇలా ఈవెంట్స్ కి, ఫంక్షన్స్ కి వెళ్తుంటే సినిమా ఎప్పుడు చేస్తావన్నా.. ఫ్యాన్స్!

Game chenger:

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ షణ్ముగం దర్శకుడు కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. శంకర్ చాలా ఏళ్ళ తర్వాత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తుండడం, పైగా రామ్ చరణ్ ఇందులో రాజకీయ నాయకుడిగా నటిస్తుండడం వల్ల సినిమాపై భారీ అంచనాలున్నాయి.

దీనికితోడు ఈ సినిమాలో ఉండే భారీ క్యాస్టింగ్ సినిమాపై ఒక భారీ తనాన్ని తీసుకువచ్చి సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసాయి, అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఏ అప్డేట్ కూడా రాలేదు. ఫస్ట్ సాంగ్ కూడా రాలేదు, కానీ సమ్మర్ కి రిలీజ్ అని మాత్రం చెప్తూనే ఉన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా సినిమా 70 శాతం పూర్తయిందని అంటున్నా, ఫ్యాన్స్ అది నమ్మడం లేదు.

ఎందుకంటే శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ గా ఉండగా, రామ్ చరణ్ ఏమో ఈవెంట్లకు, ఫంక్షన్లకు వెళ్తూ సందడి చేస్తున్నారు. మరి ఇలా ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్తూ ఉంటే సినిమా ఎప్పుడు పూర్తిచేస్తారన్నా? అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ మాత్రం మైంటైన్ చేస్తూనే వస్తున్నాడు. కాబట్టి సినిమా షూటింగ్ కి ఎక్కువగా గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. కానీ శంకర్ ఇండియన్2 పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇకనైనా శంకర్ తెలుసుకొని అభిమానుల విజ్ఞప్తి పై గేమ్ ఛేంజర్ తొందరగా ఫినిష్ చేయాలనీ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు