Kalki 2898AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో టెన్షన్ – కల్కి కూడా..?

Kalki 2898AD

ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎలక్షన్స్ కి సమయం దగ్గర పడటం, దీనికి తోడు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వటంతో రాజకీయంగా పెను దుమారమే రేగింది. బాబు అరెస్ట్ రాజకీయ సంచలనం అవ్వటమేకాకుండా టాలీవుడ్ పై కూడా ప్రభావం చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ చంద్రబాబుకి మద్దతుగా నిలవటం, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాజాగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కూడా బాబుకి మద్దతుగా నిలిచాడు. ఏపీ గవర్నమెంట్ మీద కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇదే అంశం ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ పెంచుతోంది.

నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా వైజయంతి బ్యానర్ పై రూపొందుతూ ఉండటమే ఇందుకు కారణం. అసలే ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్ల నియంత్రణ పేరుతో  సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో అశ్విని దత్ వ్యాఖ్యలు సినిమాపై ప్రభావం చూపుతుయేమో అన్న ఆందోళన పెంచుతున్నాయి. కల్కి సినిమా 2024 సమ్మర్లో వస్తుందన్న ఉహాగానాలున్న నేపథ్యంలో ఆ టైమ్ లో ఏపీలో ఎలక్షన్స్ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏపీ గవర్నమెంట్ గనక అశ్విని దత్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం సినిమాకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన ఈ సినిమా వీఎఫెక్స్ పనుల్లో జాప్యం వల్ల సమ్మర్ కి షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారని అనౌన్స్ చేయటంతో అంచనాలు తారాస్థాయికి నెలకొన్నాయి. మరి, పాన్ వరల్డ్ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు