Operation Valentine: అప్పుడే డబ్బింగ్ పనులు మొదలెట్టిన వరుణ్ తేజ్!

Operation Valentine:

గాండీవధారి అర్జున డిజాస్టర్ తర్వాత తొందరగానే కోలుకున్నాడు వరుణ్ తేజ్. కొన్ని రోజులు ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన ఈ మెగా హీరో రాగానే మళ్ళీ తన సినిమాలపై దృష్టి సారించాడు. ఇక తాను ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా “ఆపరేషన్ వాలంటైన్”. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుంచే ఫస్ట్ లుక్ రిలీజ్ అయినపుడు మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ ఇటీవల వరుణ్ తేజ్ సినిమాలు రొటీన్ గా ఉండడం, పైగా ప్రయోగాలు విఫలమవుతుండడంతో, ప్రస్తుతం చేస్తున్న సినిమాపై కూడా అంచనాలు సన్నగిల్లుతున్నట్టు అనిపిస్తుంది. అయితే అదంతా గ్యాప్ వల్లే అని చిత్ర యూనిట్ భావించి ఒక సాలిడ్ టీజర్ తో ఆడియన్స్ ని కట్టిపడేద్దామని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.

ఇక తాజాగా సినిమాకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకి డబ్బింగ్ పనులను స్టార్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియా లో ప్రకటించారు మేకర్స్. పూజ తో ఈ డబ్బింగ్ పనులను స్టార్ట్ చేయగా, త్వరలోనే ఈ సినిమా నుండి ఒక బ్లాస్టింగ్ టీజర్ ని వదలనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ నటిస్తుండగా, డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు