Varuntej: చరణన్న చెప్పడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నా- వరుణ్ తేజ్

Varuntej about RC

టాలీవుడ్ లో డిఫరెంట్ జోనర్లో సినిమాలు చేసే వాళ్లలో ముందుండే హీరో “వరుణ్ తేజ్”. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ మాస్ జోనర్ లో పోకుండా, డిఫరెంట్ సినిమాలు చేస్తూ, చేసే ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తూ, ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. ఒక్కోసారి ఆ సినిమాలు ప్లాప్ అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంటాడు వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ తేజ్ “గాండీవధారి అర్జున” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్లు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఈ ప్రమోషన్లో భాగంగానే వరుణ్ తేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాను ముందునుండి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేద్దామని ప్రయత్నించే వాడినని, అలాంటి ప్రయత్నంలోనే కంచె లాంటి సినిమాలొచ్చాయని అన్నాడు. కానీ తన 7వ సినిమా ప్లాప్ అయినప్పుడు కొంతమంది కమర్షియల్ సినిమాలు చేయమని, మెగా హీరోల్లా మాస్ సినిమాలు చేయమని ఉచిత సలహాలు ఇచ్చేవారు.

అలాంటి సమయంలో రామ్ చరణ్ తనకి ఫోన్ చేసి ఒక్కటే విషయం చెప్పారని అన్నాడు. అదేంటంటే ఒక స్థాయికి వచ్చిన తరువాత తప్పని పరిస్థితుల్లో మాస్ సినిమాలు చేయాలి. కానీ కెరీర్ ముందునుండే అలా చేస్తే మనకి ప్రత్యేకత ఉండదు. ముఖ్యంగా ప్రయోగాలు చెయ్యకుండా ప్రయత్నం చేస్తారు. వారి వలలో పడి రొటీన్ ఫార్ములా సినిమాలు చేయొద్దని చెప్పారు. ముఖ్యంగా స్కిప్ట్ సెలెక్షన్స్ లో మనం నమ్మింది ఫాలో అవ్వాలని చరణ్ చెప్పారు అని వరుణ్ తేజ్ అన్నాడు.

- Advertisement -

చరణ్ అన్న చెప్పిన మాటల వల్లే తాను ఇంత డిఫరెంట్ గా సినిమాలు తీస్తున్నానని అన్నాడు. అయితే తాజాగా మెగా ఫ్యాన్స్ ఇలాంటి సలహాలు రీమేక్ సినిమాలు తీస్తున్న మెగాబ్రదర్స్ కి కూడా ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక గాండీవధారి అర్జున ఆగష్టు 25న విడుదలకు సిద్ధం అవుతుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు