Kushi In Hindi: కొండ అన్నది కాన్ఫిడెన్సా… మళ్లీ ఓవర్ కాన్ఫిడెన్సా..?

Kushi on Hindi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ… ప్రస్తుతం యూత్ ఓ ఐకాన్. చేసింది చాలా తక్కువ సినిమాలు అయినా, ఎవరికీ రానంత ఫాస్ట్‌గా స్టార్ హీరో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది రావడానికి ఒకటి ఆయన యాక్టింగ్ అయితే, ఎక్కువ మాట్లాడుకోవాల్సింది మాత్రం రౌడీ హీరో యాటిట్యూడ్ గురించి. తన సినిమాల రి రిలీజ్ ఈవెంట్స్, ఇతర ప్రమోషన్స్ ఈవెంట్స్ లో విజయ్ దేవరకొండ మాట్లాడే తీరు ఎప్పుడూ చర్చకు దారితీస్తోంది.

విజయ్ ప్రస్తుతం సమంతతో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్1న రిలీజ్ కాబోతుంది. ఖుషి పాన్ ఇండియా సినిమా అయినా, హిందీపై ఎక్కువ ఫోకస్ చేయలేదు. కానీ, ఇప్పుడు తెలుగుతో సమానంగా హిందీ రిలీజ్ పై ఫోకస్ చేస్తున్నారట. దీనికి కారణం మన రౌడీ హీరోనే.

తనకు సౌత్‌తో పాటు నార్త్ లో కూడా మంచి మార్కెట్ ఉందని విజయ్ గట్టిగా నమ్ముతున్నాడట. దీనికి కారణం లైగర్. హై ఎక్స్‌పెక్టేషన్స్ తో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ బిగ్గెస్ట్ డిజాస్టార్ అయింది. అయితే నార్త్ లో ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. దీంతో తనకు హిందీ స్టెట్స్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్లు తన సినిమాలు చూస్తున్నారని విజయ్ ఖుషిని హిందీలో రిలీజ్ చేయబోతున్నాడు.

- Advertisement -

దీంతో నెటిజన్లు కొండ అన్న మరోసారి ఓవర్ కాన్ఫిడెంట్‌కి వెళ్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం రౌడీ హీరోకి నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉందని, అలాగే సమంతకు కూడా నార్త్ లో మార్కెట్ ఉందని గుర్తు చేస్తున్నారు. ఖుషిని లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ భాషలతో సంబంధం లేకుండా అందరు ఆదరిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఖుషి ఫలితం హిందీ స్టేట్స్ లో ఎలా ఉంటుందో.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు