Karthi: మరో లైగర్ అవకపోతే చాలంటున్న ఆడియన్స్!

Karthi:

టాలీవుడ్ లో ఒక సినిమా వచ్చిందంటే, ఆ సినిమా బాగుంటే ఎంత వరకు అయినా తీసుకెళ్లి ప్రేక్షకులు హిట్ చేస్తారు. అది కంటెంట్ ని బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది. రీసెంట్ గా నిబ్బా నిబ్బిల లవ్ స్టోరీ అంటూ వచ్చిన బేబీ సినిమాను ఆడియన్స్ ఎంత పెద్ద హిట్ చేసారో తెలిసిందే. అలాగే భోళా శంకర్ అంటూ పెద్ద సినిమా వచ్చినా కంటెంట్ లేకపోతే ఫ్యాన్స్ కూడా పట్టించుకోరని తెలిసింది. అంటే మూవీ నచ్చితే కాన్సెప్ట్ పెద్దగా బాగాలేకపోయినా, స్క్రీన్ ప్లే బాగుంటే చాలు జనాలు ఎలాంటి సినిమా అయినా హిట్ చేసేస్తారు. అదే కొంచెం తేడా కొట్టినా డిజాస్టర్ చేస్తారు. పైగా ఆ సినిమాని ట్రోలింగ్ తో పాపులర్ చేస్తారు.

ఇక అసలు విషయానికి వస్తే వరల్డ్ ఫేమస్ WWE లో ఫేమస్ ఆటగాడైన జాన్ సేన ఇండియా వేదికగా జరుగుతున్న గేమ్ లో ఆడడానికి వచ్చాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జాన్ సేనని హీరో కార్తీ కలవడం జరిగింది. ఇక అప్పట్నుంచి ఈ కాంబో లో సినిమా వస్తుందంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా కార్తీ జపాన్ సినిమా లో జాన్ సేన స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తున్నాడని మరో వార్త వచ్చింది.

ఈ న్యూస్ పై నిజానిజాలు తెలియకపోయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాలా మాత్రం చేయకండి అంటూ, మీమ్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదేదో కాదు లాస్ట్ ఇయర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ మైక్ టైసన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడన్న సంగతి తెలిసిందే. అందువల్లే సినిమాకి హైప్ రాగా, తీరా సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది ఒక లెజెండరీ బాక్సర్ ని కామెడీ చేయడానికి తీసుకున్నాడని. అప్పట్లో దీనిపై వచ్చిన ట్రోల్స్ మామూలు కాదు.

- Advertisement -

ఇక ఈ సినిమాని గుర్తు చేస్తూ కార్తీ గనుక జాన్ సేనతో సినిమా చేస్తే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి అంటూ తనని టాగ్ చేస్తూ పోస్ట్ లు వేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు