Karthi: ఎవరు ఈ జపాన్? రివీల్ చేసిన విజయ్

కోలీవుడ్ స్టార్ కార్తీ మాంచి జోరుమీదున్నాడు. గత సంవత్సరం పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో తన బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కార్తీ, ఈ సంవత్సరం పొన్నియిన్ సెల్వన్ 2 తో వచ్చి మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు సినిమా సినిమాకు తనలోని వేరియేషన్స్ చూపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటూ మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నాడు. తెలుగులోను మంచి ఫాలోయింగ్ కలిగిన కార్తీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.

ప్రస్తుతం కార్తీ “జపాన్” అనే సినిమా చేస్తున్నాడు.  మే 25 కార్తీ బర్త్ డే కానుకగా 11 గంటలకు జపాన్ టీజర్ ను విడుదల చేసారు. తమిళ్ లో శింబు, కన్నడలో రిషబ్ శెట్టి ఈ టీజర్ ను విడుదల చేయగా, తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు.

- Advertisement -

టీజర్ లో కార్తీ ఇంతకు ముందు సినిమాల కంటే కొత్తగా వెరైటీగా ఉన్నాడు. టీజర్ లో చూసిన దాన్నిబట్టి కార్తీ ఒక సీక్రెట్ డాన్ గా నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతే కాదు చిల్లర వేషాలు వేస్తూ జోకర్ లాగా ఈ టీజర్ లో చూపించారు. ఇక సునీల్ ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇక కార్తీని ఎలివేట్ చేస్తూ “మీరనుకున్నట్టు కాదు, వాడు దూల తీర్చే విలన్” అంటూ సునీల్ చెప్పే డైలాగ్ టీజర్ కి హైలెట్. ఇక టీజర్ బీజీఎమ్ చాలా బాగుంది. మొత్తంగా కొంచెం ఫన్నీగా, యాక్షన్ తో ఉంది జపాన్ టీజర్. జపాన్ సినిమాను రాజు మురుగన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా, డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో sr. ప్రకాష్ బాబు, sr. ప్రభు నిర్మిస్తున్నారు. ఇక జి.వి ప్రకాష్ మ్యూజిక్ అందించాడు. ఇక అను ఎమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తుండగా, జపాన్ మూవీని దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు