ChangureBangaruRaja: తానే దగ్గరుండి అన్నీ చేసాడు. అయినా?

Changure Bangaru Raja:

టాలీవుడ్ లో గత వారం రెండు సినిమాలు రిలీజ్ కాగా, అందులో ఒకటి డబ్బింగ్ సినిమా జవాన్. మరొకటి నవీన్ పొలిశెట్టి అనుష్క జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలవగా, ఇంకా సక్సెస్ ఫుల్ గా ఆడుతూనే ఉన్నాయి. అయితే ఈ వారం కూడా రెండు సినిమాలు రిలీజ్ అవుతుండగా, అందులో ఒకటి డబ్బింగ్ సినిమా మార్క్ ఆంటోనీ కాగా, మరొకటి స్ట్రెయిట్ సినిమా ‘ఛాంగురే బంగారు రాజా’.

కార్తీక్ రత్నం హీరోగా నటించిన ఈ కామెడీ డ్రామాని సతీష్ వర్మ డైరెక్ట్ చేసాడు. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని సెప్టెంబర్ 15న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు పెద్దగా హైప్ మాత్రం క్రియేట్ అవలేదు. మామూలుగా చిన్న సినిమాలు ఎక్కువగా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. అయితే ఈ సినిమాకి రిలీజ్ కి ముందే హైప్ తెద్దామని మాస్ రాజా రవితేజ ఎంతగానో ప్రయత్నించాడు. ఎందుకంటే ఈ సినిమాకి రవితేజ స్వయంగా ప్రొడ్యూసర్ కాబట్టి.

ట్రైలర్ రిలీస్ నుండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు, ఆఖరికి ఇంటర్వ్యూలు కూడా తానే చేస్తూ, సినిమాపై బజ్ రావడానికి తన కృషి చేసాడు. కానీ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయినా ఎక్కడా సగం కూడా బుక్ అవలేదు. ట్రైలర్ కూడా కామెడీతో నిండి ఆకట్టుకుంది. ఇక ‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ఓన్లీ మౌత్ టాక్ పైనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుందని తెలుస్తుంది. మరి రిలీజ్ అయ్యాక సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు