Tollywood: చిన్న సినిమాలు తీయడం ఆపేస్తున్న ఆ బడా నిర్మాణ సంస్థ?

Tollywood:

టాలీవుడ్ లో గత కొంతకాలంగా కొన్ని సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. కాలానుగుణంగా రొటీన్ సినిమాలకు స్వస్తి చెప్పి కొత్త రకమైన కంటెంట్ ఉన్న సినిమాలకే ఆడియన్స్ ఓటేస్తున్నారు. అది కూడా పెద్ద హీరోల సినిమాలుంటే గాని జనాలు థియేటర్లకు రావడం లేదు. దానికి హీరోల అభిమానం ఒక కారణమైతే, టిక్కెట్ల రేట్లు మరో కారణం అని చెప్పొచ్చు.

అందుకే టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒక పెద్ద సంస్థ ఇకపై చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు చేయడం తగ్గిస్తున్నారనే టాక్ గట్టిగా వినబడుతుంది. ప్రస్తుతం ఆ నిర్మాణ సంస్థ చేతిలో దాదాపు అరడజనుకి పైగా పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే అన్ని పెండింగ్ లో ఉన్న సినిమాల మధ్యన చిన్న సినిమాలు తీయడం ఎందుకు అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు టాక్ నడుస్తుంది. అదీగాక ఈ నిర్మాణ సంస్థ కి చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు టాక్ వినబడుతుంది.

అయితే ట్రేడ్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అయి ఉండొచ్చన్న టాక్ వినబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న పెద్ద సంస్థ ఇదే. ఇక ఈ సంస్థ నుండి వచ్చిన చిన్న, మీడియం రేంజ్ సినిమాలు మీటర్, అమిగోస్, హ్యాపీ బర్త్ డే, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు డిజాస్టర్లయ్యని తెలిసిందే.

- Advertisement -

ఇవే గాక గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి లాంటి సినిమాలకి మంచి టాక్ వచ్చినా కూడా ప్లాప్ అయ్యాయి. అందుకే కొన్నాళ్ళు చిన్న సినిమాలు తీయడం ఆపేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. మరి ఈ వార్త నిజమో కాదో ఆ చిత్ర నిర్మాతలే క్లారిటీ ఇవ్వాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు