Mythri Movie Makers : అంచనా ఇంత ఘోరంగా ఎలా తప్పింది..?

అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు పొందింది మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం ఇలా వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్లు కొట్టిన సంస్థ మరొకటి లేదు. ఏ పెద్ద నిర్మాణ సంస్థ అయినా ఓ పెద్ద హిట్ కొట్టాక మీడియం రేంజ్ సినిమా నిర్మించడానికి రెడీ అవుతారు. కానీ బ్యాక్ టు బ్యాక్ మూడు పెద్ద సినిమాలతో రంగంలోకి దిగి మంచి ఫలితాలను అందుకున్న ఘనత మైత్రి కే చెల్లింది. అయితే మూడు బ్లాక్ బస్టర్ లు కొట్టిన తర్వాత సవ్య సాచి, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్ లు ఎదురయ్యాయి. అలాగే నానీస్ గ్యాంగ్ లీడర్, డియర్ కామ్రేడ్ చిత్రాలు కూడా యావరేజ్ సినిమాలు వచ్చాయి.

మళ్లీ పుష్ప, సర్కారు వారి పాట వంటి చిత్రాలతో మైత్రీ మూవీ మేకర్స్ తమ హవా కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో అంటే సుందరానికీ వంటి మిడ్ రేంజ్ సినిమాని కూడా నిర్మించారు. నిజానికి సర్కారు వారి పాట సినిమా కంటే ఈ సినిమాకే ఎక్కువ ప్రమోషన్స్ చేశారు. కంటెంట్ కూడా చాలా బాగుంది. మంచి టాక్ బయటకు వచ్చింది. నాని చెప్పినట్టు ఒకసారి చూస్తే ఇంకోసారి చూడాలి అనిపించేలానే ఉంది సినిమా. కానీ జనాలను థియేటర్ కు రప్పించలేకపోతుంది. ఫుల్ రన్ లో బయ్యర్లు రూ.10 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మైత్రి వారి అంచనా ఇంత ఘోరంగా ఎలా తప్పింది అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో లో జోరుగా జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు