డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా అని బెల్లంకొండ సురేష్, తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు పెట్టినట్టు పెద్ద పెద్ద బడ్జెట్ లు పెట్టడం లేదు. తెర వెనుక ఉండి తాను చేయాల్సింది మాత్రమే చేస్తున్నాడు. తాజాగా ఆకాష్ పూరి, చోర్ బజార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దళం, జార్జ్ రెడ్డి వంటి డీసెంట్ సినిమాలను తెరకెక్కించిన జీవన్ రెడ్డి, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యనే ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం ట్రైలర్ ను బాలయ్య లాంచ్ చేసారు. అలాగే తాజాగా బచ్చన్ సాబ్ అనే పాటని రవితేజ లాంచ్ చేసారు. అలాగే ఈ చిత్రానికి సమర్పకులుగా యూవీ క్రియేషన్స్ సంస్థ వ్యవహరిస్తుంది. ఇది ప్రభాస్ కు హోమ్ బ్యానర్ వంటిది.
ఈ ముగ్గురు స్టార్ హీరోలు పూరి జగన్నాథ్ కు అత్యంత సన్నిహితులు. వీళ్ళు ఓ చెయ్యి వేస్తే ప్రమోషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అంతేకాదు ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ప్రభాస్ గెస్ట్ గా వచ్చే అవకాశం కూడా ఉందట. ఆకాష్ పూరి గత చిత్రం రొమాంటిక్ కోసం ఒక రోజు కేటాయించాడు ప్రభాస్. ఫ్రీగా అతను ఒక రోజు కాల్ షీట్ కేటాయించడం అంటే మాటలు కాదు.