ఈ మధ్య కాలంలో విడుదలయ్యే సినిమాలకి రన్ టైం కూడా చాలా ముఖ్యం. ఓ సినిమా మూడు గంటలు ఉంటుంది అంటే థియేటర్ కు వెళ్లే రోజులు కావు ఇవి. పెద్ద సినిమాలు అదీ హిట్ టాక్ వచ్చిన సినిమాలు అయితే ఓకె. చిన్న సినిమాలు అయితే రెండు గంటల ముప్పై నిమిషాలు అంతకంటే ఎక్కువ అయితే కష్టం అన్నట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా 3 గంటల రన్ టైం, కే.జి.ఎఫ్, సర్కారు వారి పాట 2 గంటల 40 నిమిషాలు పైనే.! అవి పెద్ద సినిమాలు కాబట్టి చెల్లింది. మరి అంటే సుందరానికీ చిత్రం 2 గంటల 50 నిమిషాల పైనే రన్ టైం అంటే జనాలు ముందుగానే భయపడ్డారు. సినిమా బాగానే ఉన్నా, జనాలు థియేటర్ కు రాకుండా చేసిన అంశం ఇదే అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే కలెక్షన్లు అంత దారుణంగా నమోదు అయ్యాయి. ఏది ఏమైనా అంటే సుందరానికీ చిత్రం మిగిలిన చిన్న , మిడ్ రేంజ్ సినిమాలకి ఓ గుణపాఠం నేర్పింది అని చెప్పాలి.
మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న విరాటపర్వం చిత్రానికి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల రన్ టైం ఉండేలా జాగ్రత్త పడ్డారు మేకర్స్. సినిమాకి తక్కువగానే ప్రమోషన్లు చేసినా పాజిటివ్ బజ్ ఏర్పడింది. 1990 ల టైంలో నక్సలైట్ లకు పోలీసులకు మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగ ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.