సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ సీక్వెల్ పుష్ప ది రూల్ పనిలో ఉన్నాడు ఈ ఐకాన్ స్టార్. చిత్రం చేస్తూనే మరో పక్క తన తర్వాతి సినిమాకి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ పేరు రావడంతో, సీక్వెల్ లో మరింత క్రేజ్ పెరిగే అవకాశముంది. దీంతో పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేయాలని బన్నీ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అతను విక్రమ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని భాషల్లో ఈ మూవీ కొనుగోలు చేసిన బయ్యర్లు లాభాల బాట పట్టారు. ఈ సినిమా ఇటీవల వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ .300 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ టాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ముందుగా రామ్ చరణ్ కు కథ చెప్పాడని. కానీ రామ్ చరణ్ జెర్సీ దర్శకుడు గౌతమ్ తో ఓ సినిమా ఉండటంతో ఈ కాంబోకు బ్రేక్ పడ్డాయని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ కు మరో కథ వినిపించినట్టు, దానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి కాంబో సెట్ అయినట్టు టాక్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.