రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా, వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. జూన్ 17 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో పాటు రానా బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఇప్పటి పాన్ ఇండియా స్టార్ అయిన రాంచరణ్ కూడా హాజరవుతాడు అని చిత్ర బృందం ప్రకటించాడు. కానీ కట్ చేస్తే రాంచరణ్ ఈ వేడుకకు రాలేదు. ఆ విషయాన్ని తెలుపుతూ, చరణ్ అభిమానులకు హీరో రానా క్షమాపణలు చెప్పాడు. చరణ్ ఫ్లైట్ మిస్ అవ్వడం వలన తాను ఇక్కడికి రాలేకపోయాడని రానా చెప్పుకొచ్చాడు.
రాంచరణ్ తన 10 వ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య ఉపాసనతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే తన టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు చరణ్ – ఉప్సీ. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు రాంచరణ్. ఇక అతను కనుక వచ్చి ఉంటే విరాటపర్వం ప్రమోషన్ కు మరింత మైలేజ్ చేకూరేది. ఇది మిస్ అయినా చరణ్, సక్సెస్ మీట్ పెడితే వస్తాను అని రానా కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.