Ram Gopal Varma : వర్మ బాలీవుడ్ బాట

రామ్ గోపాల్ వర్మ, సినిమా చేస్తేనే కాంట్రవర్సీ. నిజానికి కాంట్రవర్సీ ఉన్న సినిమాలనే ఆయన తీస్తాడు. ప్రేక్షకులను చూడాలిని కాదు, దర్శకత్వం చేయాలని సినిమాలు చేస్తాడు. హిట్, ప్లాప్ తో సంబంధం లేదు. నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట జరిగే విషయాన్ని తీసుకుని సినిమాలు చేస్తుంటాడు. కొంతమంది ఆయన సినిమాలు ఫాలో అవుతారు. దానికంటే ఎక్కువ మంది వర్మ, ఏంటయ్యా మాకు కర్మ అంటారు.

ఈ వివాదాస్పద దర్శకుడికి హిట్ సినిమా పడి చాలా రోజులే అవుతుంది. ఇటీవల వచ్చిన సినిమాలు థియేటర్స్ లో కనీసం వారం రోజులు కూడా ఉండటం లేదు. దీని వల్ల వర్మకు ఉన్న కాస్త ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే వర్మ తన ఫామ్ ను తిరిగి పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒక హిట్ సినిమా పడితే, వర్మ క్రేజ్ పెరుగుతుంది. ఈ హిట్ సినిమా కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను వర్మ ఎంచుకున్నాడు.

తన తర్వాత సినిమా బిగ్ బితో ఉంటుందని వర్మ తాజాగా “కొండ” ప్రమోషన్స్ లో భాగంగా అనౌన్స్ చేశాడు. వర్మకు ఎప్పుడైనా డేట్స్ ఇస్తానని పలు సార్లు చెప్పిన బిగ్ బి, తాజా గా వర్మ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అమితాబ్ ఎంతో ఇష్టపడే హర్రర్ జోనర్ లోనే ఈ సినిమా ఉంటుందని, నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని బీ టౌన్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కాగ రామ్ గోపాల్ వర్మ – అమితాబ్ బచ్చన్ కాంబో ఇప్పటి వరకు సర్కార్, నిశ్శబ్ద్, ఆగ్, సర్కార్ రాజ్, సర్కార్-3 లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో సర్కారు సినిమా పెద్ద హిట్ అందుకోగా, నిశ్శబ్ద్ పర్వాలేదనిపించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు