OG Shooting Update: ఫైర్ స్ట్రోమింగ్ కమ్మింగ్… పవన్ బ్యాక్ టూ సెట్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్‌ప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా రెడీగా ఉన్నారు. కానీ, అసలు సమస్య అంతా పవర్ స్టార్ కాల్సీట్స్ మాత్రమే. పొలిటికల్ గా చాలా ప్లాన్డ్ గా పవన్ ఇప్పుడు సినిమాల షూటింగ్స్ కొంత గ్యాప్ మెయింటేన్ చేస్తున్నారు. ఏమైనా టైం దొరికితే, షూటింగ్స్ కి వస్తున్నారు. లేదంటే, వారహి ఎక్కి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

అయితే రీసెంట్ పవన్ ఫ్యాన్స్ కిక్కెక్కించే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అదేటంటే… ఫ్యాన్స్ కి మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న OG కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే 50 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ఇప్పుడు పవన్‌తో ఉన్న సీన్స్‌ను షూట్ చేయాలని డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు OG షూటింగ్ ఎందుకంటే, చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ హైదరాబాద్‌కిి వచ్చారు.

ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉండబోతున్నారట. ఈ సమయాన్ని వృథా చేయకుండా మంచి ఫాంలో ఉన్న సుజిత్‌కు కేటాయించాలని పవన్ ఫిక్స్ అయ్యారట. అలా OG కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అన్నమాట. నిజానికి పవన్ ఒప్పుకున్న అన్ని సినిమాల్లో కంటే, OG చాలా లేట్ గా వచ్చింది. కానీ, యంగ్ డైరెక్టర్ సుజిత్ సూపర్ ప్లాన్ వల్ల ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇది ఇలాగే ఉంటే, నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో OGని థియేటర్‌లో చూసేయొచ్చు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు