Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కి ఝలక్… వారసుడు ఎంట్రీ లేనట్టే?

Mokshagna Entry:

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు.. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. మోక్షజ్ఞ ఎంట్రీపై స్వయంగా బాలయ్య అనౌన్స్ మెంట్ ఇచ్చినా, ఫ్యాన్స్‌కి ఎక్కడో అనుమానాలు. ఈ ఏడాది.. వచ్చే ఏడాది అంటూ వారసుడి ఎంట్రీ వాయిదా పడుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి.

ఓ సందర్భంలో మోక్షజ్ఞ ఎంట్రీ పై వేణు స్వామి మాట్లాడుతూ.. మోక్షజ్ఞ యాక్టింగ్ కెరీర్ బాగుంటుందని, అయితే ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఉండదని, దానికి ఇంకా చాలా టైం పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. మోక్షజ్ఞ ఎంట్రీకి కనీసం రెండు నుంచి మూడేళ్ల టైం పడుతుంది అంటూ బాంబ్ పేల్చాడు. నిజానికి వేణు స్వామి వ్యాఖ్యలను నందమూరి ఫ్యాన్స్ పెద్దగా సీరియస్ తీసుకోకపోవచ్చు.

కానీ, సమస్య అంతా, మోక్షజ్ఞ ఫైనల్ అయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది అంటూ దాదాపు రెండేళ్ల నుంచి అంటున్నారు. కానీ, కనీసం స్క్రీప్ట్ పనులు కూడా స్టార్ట్ కాలేదని టాక్. ఇదే సమయంలో మోక్షజ్ఞ లుక్ పరంగా కూడా ఎక్కడా హీరో పోలీకలు కనిపించడం లేదు. మోక్షజ్ఞ ఫస్ట్ తన బాడీపై ఫోకస్ పెట్టాలి. మంచి బాడీ వచ్చాకా, సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి బాలయ్య దర్శకత్వం వహిస్తానని చెప్పాడు. కానీ, ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాల లైనప్ ఎక్కువ ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో బాలయ్య మెగా ఫోన్ పట్టుకోవడం కష్టమే. దానికి చాలా టైం పడుతుంది.

- Advertisement -

ఇలా కారణాలు అన్నీ చూస్తే, వేణు స్వామి చెప్పింది నిజమే అనే భావన నందమూరి ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. వేణు స్వామి చెప్పినట్టు మోక్షజ్ఞ ఎంట్రీకి ఇంకా మూడేళ్లు పడుతుందా? లేదా బాలయ్య ముందుగానే ఎంట్రీని ప్లాన్ చేస్తాడా? చూడాలి మరీ.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు