Mokshagna : ఆ బాధ్యత అనిల్ రావిపూడిదేనా..?

కొడుకును వెండి తెరకు పరిచయం చేయడానికి బాలయ్య రెడీ అయిపోయాడు. ’ఆదిత్య 369’ రీమేక్ మూవీని తన కుమారుడు మోక్షజ్ఞతో చేయిస్తానని బాలయ్య ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు బాలయ్య. ‘షైన్ స్క్రీన్స్’  వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సెప్టెంబ‌రు నుండి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించబోతుంది. ఈ సినిమా బాలయ్య ఇమేజ్ కు భిన్నంగా ఉండబోతుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించి, ఈ సినిమాపై ఆసక్తి పెంచాడు.
ఇదిలా ఉండగా.. అనిల్ పై బాలయ్య మరో బాధ్యత కూడా పెట్టాడట. వివరాల్లోకి వెళితే.. బాలయ్య కొడుకు మోక్ష‌జ్ఞని హీరోగా లాంచ్ చేయమని,  అభిమానులు బాలయ్య పై బాగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ మోక్షజ్ఞకి ఇంట్రెస్ట్ లేనట్టు వ్యవహరిస్తున్నాడు. మోక్ష‌జ్ఞ లుక్స్ ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మొదటి సినిమాను ఎలా రెడీ చేయాలి అనే విషయాలు తరచూ అనిల్ తో బాలయ్య చర్చిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అనిల్ కు మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అతను ఏ సినిమా తీసినా ప్రేక్షకులను తన టేకింగ్ తో మెప్పించగలడు.  అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను అనిల్ పై బాలయ్య పెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు