Raviteja: ఆ హీరోయిన్ వల్ల రవితేజ కూడా తన భార్యకి విడాకులు..?

Raviteja

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. కానీ అందులో చాలా మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చినవారే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్నారు రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా పెద్ద హీరోగా ఎదిగారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని కలిగి ఉన్నారు రవితేజ. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా తప్పనిసరిగా రూమర్స్ ఎదుర్కోవాల్సిందే. అలా రవితేజ గురించి కూడా ఓ రూమర్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది. అదేంటంటే రవితేజ స్టార్ హీరోయిన్ అనుష్కతో డేటింగ్ లో ఉన్నారని.. అప్పట్లో వీరిద్దరూ కలిసి ఓ హోటల్ లో గడిపారని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. ఈ కారణంగా రవితేజ ఇంట్లో గొడవలు కూడా జరిగాయట.

వీరిద్దరి విషయం తెలిసిన ఆయన భార్య రవితేజకు విడాకులు కూడా ఇవ్వాలని అనుకుంది అంటూ ప్రచారం చేశారు కొందరు. ఆ తర్వాత కొంతకాలానికి అటువంటి వార్తలలో వాస్తవం లేదంటూ కుటుంబ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది. ఇక ఈ రూమర్స్ సర్దుమనిగిన కొన్నాళ్ల తర్వాత రవితేజ ఈ విషయంపై స్పందిస్తూ.. “అనుష్క నాకు మంచి స్నేహితురాలు. ఎవరెవరో ఏదో రూమర్స్ క్రియేట్ చేస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు” అని స్పష్టం చేశారు. దీంతో ఆ విషయం అక్కడితో సర్దుమనిగింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు