Janhvi kapoor: దేవరలో మరో భామ?

Janhvi kapoor:

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి దేవర. ఈ RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య ప్లాప్ వల్ల కొరటాల కోలుకోవడానికి టైం తీసుకున్నాడన్న సంగతి తెలిసిందే. అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాకే ఈ ఇయర్ లోనే మొదలైన షూటింగ్ గ్యాప్ లేకుండా జరుపుకుంటుంది.

అయితే ఒక్కోసారి హీరో లేకపోయినా సరే ప్రధాన తారాగణం ఉన్న సీన్లను షూట్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఇక దేవర సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ హీరోయిన్ పై పలు సీన్లు చిత్రీకరణ జరుపగా, తాజాగా దేవర సినిమాలో మరో హీరోయిన్ ఉండబోతుందని సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా భైరా అనే పాత్రలో నటిస్తున్నాడన్న విషయం విదితమే. అయితే ఆ భైరా కి చెల్లెలిగా ఒక హీరోయిన్ నటించబోతుందట. ఆ హీరోయిన్, ఎన్టీఆర్ ని వన్ సైడ్ లవ్ చేస్తూ విలన్ నుండి పలు సందర్భాల్లో రక్షిస్తూ వస్తుందని సమాచారం. ఈ విషయం హీరోకి మాత్రం తెలియదు. అది కథలోని భాగమేనని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి. అయితే సినిమాలో ఆ హీరోయిన్ ఎవరూ అన్నది ఇప్పటివరకు తెలియదు. కొందరు నెటిజన్లు మాత్రం శ్రీనిధి శెట్టి అంటున్నారు. మరి దీనిపై చిత్ర యూనిటే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు