Salaar vs Dunki: ప్రశాంత్ నీల్ వర్సెస్ షారుఖ్ ఖాన్ – సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందా..?

Salaar vs Dunki

కొన్ని సార్లు ఆసక్తికర సంఘటనలు కోఇన్సిడెన్స్ గా జరుగుతూ ఉంటాయి. సలార్, డుంకి సినిమాల విషయంలో కూడా కోఇన్సిడెంటల్ గా సిచువేషన్ రిపీట్ అవుతోంది. అలాంటప్పుడు ప్రభాస్ వర్సెస్ షారుఖ్ అనాలి కానీ, ప్రశాంత్ నీల్ వర్సెస్ షారుఖ్ ఆంనమేంటని అనుకుంటున్నారా?, అందుకు కరెక్ట్ రీజన్ ఉంది.
అదేంటంటే, 2018లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ పార్ట్1, షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయ్యాయి. కేజిఎఫ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలువగా, భారీ అంచనాలతో వచ్చిన జీరో సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిజంగానే జీరోగా మిగిలింది.
ఇప్పుడు సలార్, డుంకి సినిమాలు డిసెంబర్లో వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. నిజానికి సలార్ సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా టెక్నీకల్ ఇస్స్యూస్ వల్ల డిలే అయ్యి డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో రూపొందుతున్న డుంకి సినిమా కూడా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో గతంలో కేజిఎఫ్, జీరో సినిమాల విషయంలో వచ్చిన రిజల్ట్  ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, పఠాన్, జవాన్ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో ఊపు మీదున్న షారుఖ్ కి డుంకి సినిమాతో హ్యాట్రిక్ ఖాయం అని షారుఖ్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి, కంటెంట్ గెలుస్తుందా?, కోఇన్సిడెన్స్ నిజమవుతుందా చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు