Skanda: ఇంకా ఆ హీరోల వెనకే ఉన్న రామ్..!

Skanda:

టాలీవుడ్ లో ఈ జెనరేషన్ లో క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా ఆరుగురు టాప్ హీరోలున్నారన్న విషయం తెలిసిందే. వీళ్ళనే టైర్ 1 హీరోలని కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అయితే ఈ స్టార్స్ టైర్2 అని పిలువబడే హీరోలు కూడా ఉన్నారు. వాళ్లే నాని, విజయ్ దేవరకొండ, రామ్ పొతినేని, నాగ చైతన్య, వరుణ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, సాయి ధరమ్ తేజ్.. ఇంకా కొందరున్నారు. అయితే వీళ్ళ ప్లేస్ లు మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒకసారి నాగ చైతన్య ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, మరోసారి విజయ్, ఇంకోసారి వరుణ్, అప్పుడప్పుడు రామ్, ఇలా మారగా, ఎక్కువ సార్లు టాప్ ప్లేస్ లో నాని ఉన్నాడు.

అయితే సీనియారిటీ ప్రకారం ఈ హీరోల్లో టాప్ లో ఉండాల్సింది రామ్. కానీ స్క్రిప్ట్ సెలక్షన్స్ లోపల వల్ల తన ప్లేస్ ని కోల్పోతూ వస్తున్నాడు. రెండేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా ఫామ్ లోకొచ్చినా, ఆ తరువాత మళ్ళీ వెంటనే డౌన్ అయ్యాడు. ఇక లేటెస్ట్ గా స్కంద తో తిరిగి తన జోరు చూపించాలని బాక్స్ ఆఫీస్ పైకి దూసుకొచ్చాడు. కానీ ఆ సినిమా రొటీన్ టాక్ తెచ్చుకోవడం తో కలెక్షన్స్ పై ప్రభావం పడింది. నిజానికి రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఓవరాల్ గా టైర్ 2హీరోల్లో మూడో స్థానంలో ఉన్నాడు.

మొదటి ప్లేస్ లో నాని దసరా(14cr) సినిమాతో రెండో ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఖుషి(9.8cr) ఉన్నారు. ఇక ఆ తర్వాత కూడా విజయ్ లైగర్, ఉండగా ఐదో ప్లేస్ లో ఇస్మార్ట్ శంకర్ ఉంది. మరి సీనియారిటీ పరంగా నాని, విజయ్ కన్నా ఎక్కువ ఉన్న రామ్ పొతినేని ఎప్పుడు టైర్ 2లో టాప్ ప్లేస్ ని దక్కించుకుంటాడో..?

- Advertisement -

Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses,

new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు