Manchu Vishnu: భక్త కన్నప్ప సినిమాలో సూపర్ స్టార్ – మంచు బాబు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడుగా..!

Manchu Vishnu

ఇండస్ట్రీ వర్గాలనే కాకుండా ఆడియెన్స్ కి కూడా షాక్ ఇస్తూ ఇటీవల మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంతకు మించిన షాక్ ఇస్తూ ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ క్యామియో రోల్ లో నటిస్తున్నాడని వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
ఆ న్యూస్ ని డైరెక్ట్ గా కన్ఫార్మ్ చేయకపోయినప్పటికీ ప్రభాస్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసాడు విష్ణు. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు విష్ణు. అదేంటంటే, కన్నప్ప సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడని అనౌన్స్ చేసాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న భక్త కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారన్న వార్తలతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
వాస్తవానికి భక్త కన్నప్ప రెబల్ స్టార్ కృష్ణం రాజు డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన బతికున్నంత కాలం ప్రభాస్ హీరోగా ఈ సినిమా తీయాలని కళలు కనే వాడు. పలు సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి తన సుముఖత కూడా వ్యక్తం చేశాడు ప్రభాస్. ఏ కారణం చేతనో కృష్ణం రాజు బతికుండగా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయటంతో ప్రభాస్ కొంత నిరాశకి గురయ్యారు. అంతే కాకుండా ప్రభాస్ ఈ సినిమా శివుడి వేషంలో క్యామియో రోల్ లో కనిపిస్తాడని టాక్ ఉన్న నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ రాముడి క్యారెక్టర్లో నటించిన ఆదిపురుష్ డిజాస్టర్ కావటమే ఇందుకు కారణం. అనౌన్సమెంట్స్ తోనే అంచనాలు పెంచుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో వేచి చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు