Manchu Vishnu Kannappa: ప్రభాస్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..!

Manchu Vishnu kannappa:

ఆదివారం తెల్లవారు జామున నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అదే మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడని, అందులోనూ శివుడి పాత్ర అనేది న్యూస్. దీన్ని మంచు విష్ణు కూడా సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేశాడు. దీంతో కన్నప్ప మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. మంచు ఫ్యామిలీకి ఉన్న అతి కొద్ది మంది అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.

ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కి అటు కక్కలేక ఇటు మింగలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ రకంగా ప్రభాస్‌ను శివుడి పాత్రలో చూస్తున్నందకు సంతోషిస్తున్నారు. అలాగే, డిజాస్టార్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ అంటే మాత్రం జీర్ణించుకోవడం లేదు. ప్రభాస్‌కి ఇప్పటికే వరుసగా మూడు ఫ్లాప్‌లు ఉన్న తర్వాత ఇలాంటి ప్రయోగం చేయడం అవసరమా? అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

అలాగే కన్నప్ప సినిమాకు ప్రభాస్‌కు విడదీయరాని బంధం ఉంది. భక్త కన్నప్ప మూవీకి పేటెంట్ హక్కులు ఎవరికి ఉన్నాయని టాలీవుడ్‌‌లో ఎవరినీ అడిగినా ప్రభాస్ పేరే చెబుతారు. కృష్ణం రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప. ప్రభాస్‌ను మెయిన్ లీడ్‌గా పెట్టి సినిమా చేయాలని కూడా అనుకున్నాడు. కానీ, జరగకుండానే కృష్ణం రాజు కన్నుమూశారు. కానీ, ఇప్పుడు కన్నప్ప సినిమా టాలీవుడ్ ట్రోల్ స్టార్ మంచు విష్ణు చేస్తున్నాడు.

- Advertisement -

ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ ఎందుకు చేయాలనుకున్నాడు అనే ప్రశ్న వస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి. ఈ సినిమాను పక్కనపెట్టి, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్‌తో పాటు మారుతితో చేసే సినిమాపై ఫోకస్ పెట్టి ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే డిజాస్టార్ & ట్రోల్ స్టార్ మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ నటించడానికి ఒప్పుకోవడం కూడా ఒక ధైర్య సాహసమే అని అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు