Pawan Kalyan Movies: బాబు అరెస్ట్ – డైరెక్టర్స్ కి రెస్ట్..!

Pawan Kalyan Movies

2024 ఎలక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్ట్ చేయటంతో రాజకీయంగా దుమారం రేగింది. ఇదిలా ఉండగా ఈ అరెస్ట్ ఉదంతం పవన్ కళ్యాణ్ సినిమాలపై పడే అవకాశం కనిపిస్తోంది. బాబు అరెస్ట్ అయితే, పవన్ సినిమాల మీద ఎఫెక్ట్ పడటం ఏంటని అనుకుంటున్నారా?, వివరాల్లోకి వెళితే, బాబు అరెస్ట్ ని ఖండించిన పవన్ ఆయనను పరామర్శించటానికి విజయవాడ బయల్దేరటం, అక్కడ పోలీసులు పవన్ ని అదుపులోకి తీసుకోవటం వంటి నాటకీయ పరిణామాలు చూస్తుంటే ఇక పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల మీద కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉందని అనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశం ఉంది. అసలే పవన్ రెండు పడవల ప్రయాణం వల్ల చాలాసార్లు షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డైరెక్టర్స్ హరీష్ శంకర్, సుజిత్ లకు కొంత కాలం పాటు బ్రేక తప్పేలా లేదని అనిపిస్తోంది.
సేల్ తన ఫెవరెట్ హీరోతో సినిమా చేస్తున్న ఉత్సాహంలో ఉన్న సుజిత్ ఓజిని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన గ్లిమ్ప్స్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ అటకెక్కిన పరిస్థితిలో ఉండగా తాజాగా నెలకొన్న పరిణామాల వల్ల ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు కూడా ఆ పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన మొదలైంది పవన్ ఫ్యాన్స్ లో.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు