Bhaktha kannappa: పెదనాన్న డ్రీం ప్రాజెక్టుని ప్రభాస్ వదిలేసాడా?

Bhaktha kannappa:

టాలీవుడ్ లో రెబల్ స్టార్ క్రిష్ణంరాజు కి ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఉండేది. అప్పటివరకు అందరు క్లాస్, ఫ్యామిలీ సినిమాలు చేస్తుండగా, పక్కా మాస్ సినిమాలు చేస్తూ ఒక ట్రెండ్ సెట్ చేసిన ఆరడుగుల మొనగాడు కృష్ణం రాజు. అయన అడుగుజాడల్లోనే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పెదనాన్న లాగే మాస్ సినిమాల కథానాయకుడిగా రెబల్ స్టార్ గా ఎదిగి కృష్ణం రాజు పేరు నిలబెట్టడమే గాకుండా, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా తన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలంటే చాలానే ఉన్నాయి. కానీ అందరు స్పెషల్ గా భావించేది “భక్త కన్నప్ప” సినిమానే. ఈ చిత్రం గురించి తెలుగువారికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక గొప్ప శివ భక్తుడి కథగా వచ్చిన ఈ చిత్రంలోని పాటలు ఏ శివాలయం వెళ్లినా ఇప్పటికి వినబడుతుంటాయి. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆరోజుల్లోనే సంచలన విజయం సాధించింది.

అయితే తర్వాతి రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రభాస్ తో నిర్మిద్దామని కృష్ణం రాజు ఎంతో ప్రయత్నించారు. ఇక ఆ సినిమాని రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీద్దామని అనుకున్నారు. పైగా ఈ సినిమా ప్రభాస్ తో తీయాలనేది తన డ్రీం అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే అనుకోకుండా కృషం రాజు గత ఏడాది కన్నుమూయడం జరిగింది. అక్కడితో సినిమా గురించి అందరు మర్చిపోయారు.

- Advertisement -

అయితే తాజాగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప చిత్రాన్ని మళ్ళీ తీస్తున్నామని అనౌన్స్ చేసాడు. నిజానికి భక్త కన్నప్ప చిత్రం పైన పూర్తి స్థాయి హక్కులు ఒక్క ప్రభాస్ కే ఉంటాయని తెలిసిందే. ఆ విషయం ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఒప్పుకుని తీరతారు. కానీ ఇప్పుడు మంచు విష్ణు తీస్తున్నానని అనౌన్స్ చేయడంతో రెబల్ స్టార్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

తాజాగా ప్రభాస్ కూడా ఈ సినిమా లో క్యామియో రోల్ చేస్తున్నాడని, అది మహాశివుడి పాత్ర అని అంటున్నారు. అయితే భక్త కన్నప్ప ని ప్రభాసే తీస్తే బాగుంటుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పైగా పెదనాన్న డ్రీం ప్రాజెక్ట్ ని ప్రభాస్ నెరవేరిస్తే తమకు అంతకన్నా వేరే ఏమి అక్కర్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాపై అన్ని రకాల పేటెంట్స్ రైట్స్ ప్రభాస్ కి మాత్రమే ఉన్నాయనేది ప్రభాస్ ఫ్యాన్స్ మాట. టాలీవుడ్ జనాలు కూడా ఈ భారీ ప్రాజెక్ట్ కి ప్రభాస్ అయితేనే సెట్ అవుతాడు అంటున్నారు.

మరి ప్రభాస్ వరకు ఈ వార్త వెళుతుందో లేదో తెలియదు గాని, రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం భక్త కన్నప్ప మంచు ఫ్యామిలీ కాకుండా ప్రభాసే తీయాలని ఆశపడుతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు