Trivikram: మహేష్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇవ్వబోతున్న థమన్!

Trivikram:

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి ఏడాది గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. షూటింగ్ జరుగుతున్న సినిమా గురించేమో అప్డేట్ కూడా లేదని మహేష్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. గుంటూరు కారం నుండి ఒక్కొక్కరు వెళ్లిపోతుండడం చూసి కొందరైతే అసలు ఈ సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అన్న సందేహం లో ఉన్నారు. ఈ అనుమానాలన్నిటికి తేరా దించుతూ చిత్ర యూనిట్ నుండి సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది.

త్రివిక్రమ్ థమన్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, మూవీ యూనిట్ మహేష్ ఫ్యాన్స్ ను రెడీ అవ్వమని, తొందర్లోనే సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నామని అన్నారు. పైగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కూడా ఉందంటూ చెప్పేసారు. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం గుంటూరుకారం ఫస్ట్ సాంగ్ మహేష్ బాబు ఇంట్రో సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాట లో మహేష్ ఎంట్రీ ఇస్తుంటే ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు.

ఇక ఫస్ట్ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రాసారని, ఆ సాంగ్ ని కైలాష్ కేర్, లేదా శంకర్ మహదేవన్ తో పట్టిస్తున్నారని టాక్. ఇక మహేష్ బాబు ఇంతకు ముందు సినిమాల కన్నా రఫ్ లుక్స్ తో ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడని ఫస్ట్ లుక్ ద్వారానే తెలిసిపోయింది. ఇక థమన్ అలవైకుంఠపురంలో సినిమాలో క్లాస్ ట్యూన్స్ తో అలరించగా, గుంటూరు కారంలో మాస్ ట్యూన్స్ తో దుమ్ములేపుతాడని తెలుస్తుంది. అయితే గుంటూరు కారం నుండి ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాతే మళ్ళీ రిలీజ్ డేట్ పై ఓ నమ్మకం వచ్చేది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు