Rajamouli: బ్రెజిల్ ప్రెసిడెంట్ ని మెప్పించిన ‘RRR’

Rajamouli:

టాలీవుడ్ ప్రౌడ్ సినిమా, ఇండియన్ సెన్సేషనల్ మూవీ RRR తన విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు గా నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం రిలీజ్ అయి ఏడాది కి పైగానే అయినా, ఇప్పటికి పలు దేశాల్లో ప్రదర్శింప బడుతూనే ఉంది. ఇక జపాన్ లో అయితే RRR ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మంత్రులు, మినిస్టర్లే కాదు, ఏకంగా ఇతర దేశాల మినిస్టర్లు, ప్రెసిడెంట్లను మన సినిమా మెప్పిస్తుంది.

అందుకే ఆస్కార్ వరకు వెళ్లి మరీ అవార్డు తీసుకువచ్చింది. ఆ ఆస్కార్ సాక్షిగానే జేమ్స్ కామెరూన్ మన తెలుగు సినిమాను పొగిడాడు. జపాన్, రష్యా, సింగపూర్ దేశాల ప్రతినిధులు, అక్కడి మంత్రులు RRR చిత్రం గురించి ఎంతో మెచ్చుకున్నారు. ఇక తాజాగా RRR సినిమాపై మరో దేశపు నేత ప్రశంసల జల్లు కురిపించాడు. బ్రెజిల్ దేశం యొక్క ప్రెసిడెంట్ ‘లూయిజ్ ఇనాకియో లులా డా సిల్వ’ ఓ వేదికపై మాట్లాడుతూ RRR సినిమా చూసాను. చాలా బాగుంది. అందులో ఎంతో ఫన్, ఇంకా యాక్షన్ ఉంది. ఆ డైరెక్టర్ బ్రిలియెంట్ గా సినిమాని తీశారు, సినిమాలో ఆర్టిస్టులు కూడా అద్భుతంగా చేసారని అన్నాడు.

- Advertisement -

అలాగే భారతీయ చరిత్రని కూడా ఎంతో బాగా చూపించారని చెప్పడం జరిగింది. ఆయన ప్రశంసలకి RRR మూవీ టీం, ఇంకా రాజమౌళి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు