RRR: జపాన్ మినిస్టర్ ని మెప్పించిన గ్లోబల్ స్టార్!

Ram Charan impressed the Japanese minister

టాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కష్టపడి ఎదిగి, తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. గత సంవత్సరం RRR ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR ఆరు నెలల కిందట జపాన్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ చేసిన ఆ సినిమా మంచి టాక్ తో భారీ బ్లాక్ బస్టర్ అయింది. RRR ని ప్రమోట్ చేయడానికి రాజమౌళి మూవీ టీమ్ మొత్తం కూడా జపాన్ కి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ సినిమా లాంగ్ రన్ లో 120 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేసి జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఇప్పటికి RRR అక్కడ పలు థియేటర్లలో రన్ అవుతుండడం విశేషం.

ఇక RRR సినిమాని తాజాగా జపాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అయిన “హయాషి” స్పెషల్ స్క్రీనింగ్ వేసుకొని చూడడం జరిగింది. ఆ సినిమాలో రామ్ చరణ్ చేసిన పెర్ఫార్మన్స్ కి జపాన్ మినిస్టర్ ఫిదా అయిపోయాడట. ఇటీవల జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో RRR గురించి రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి హయషి ప్రస్తావించడం జరిగింది. ఇక ఈ వార్త విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరో గ్లోబల్ స్టార్ గా మరింత పాపులర్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీ గా ఉన్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత బుచ్చిబాబు తో చేయనున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు