Power Star Pawan Kalyan: హీరో కాదు… పక్కా విలన్

Power Star Pawan Kalyan

టాలీవుడ్‌లో క్రేజ్ అనే పదం పుట్టింది పవన్ కళ్యాణ్‌ని చేసే అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆయన రోడ్డు మీద అడుగు పెడితే, లక్షల మంది అభిమానులు వస్తారు. పవన్ పొలిటికల్ మీటింగ్స్‌లో ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇంతటి క్రేజ్ రావడానికి పవన్ కళ్యాణ్ హీరోయిజమే కారణమని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో హీరోయిజం చూపించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక స్థానం.

అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో కాదు… విలన్ అయిపోతున్నాడు. ఈ ముక్క పవన్ స్టార్ ఫ్యాన్స్ వింటే వాళ్లకి కోపం కట్టలు తెంచుకుంటది కావొచ్చు. పవన్ విలన్ అవ్వడం నిజ జీవితంలో కాదండి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోయే సినిమాలో. పవన్ విలన్ అయితే హీరో ఎవరు? అనే క్వశ్చన్ వచ్చిందా? హీరో కూడా పవనే. ఇదేంటి డ్యూయల్ రోల్ అనుకున్నారా? కాదు.. ఒక పాత్రే. కానీ విలన్ షేడ్స్ ఉన్న హీరో.

కేజీఎఫ్ సినిమా తర్వాత హీరోలకు నెగిటివ్ షేడ్స్ పెట్టి, హీరోయిజంలో వైవిద్యత చూపిస్తున్నారు డైరెక్టర్లు. ఇప్పుడు ఏజెంట్‌తో బిగ్గెస్ట్ డిజాస్టార్ అందుకున్న సురేందర్ రెడ్డి కూడా ఈ ఫార్ములానే నమ్ముకోబోతున్నాడట. పవన్ పాత్రకు నెగిటివ్ షెడ్స్ పెట్టి ఒక పవర్ ఫుల్ యాక్షన్ మూవీ చేయడానికి స్టోరీని రెడీ చేశాడట.

- Advertisement -

పవన్ కూడా తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక సారి కూడా నెగిటివ్ షెడ్స్ రోల్ చేయలేదు. దీంతో ఈ మూవీపై పవర్ స్టార్స్ ఫ్యాన్స్‌లో కూడా ఒకింత ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఇక్కడ సురేందర్ రెడ్డికి ఒక పెద్ద సవాల్ ఉందని అంటున్నారు క్రిటిక్స్.

అదేంటంటే? ఇక వేళ మూవీ హిట్ అయితే సురేందర్ రెడ్డికి పవర్ స్టార్ ఫ్యాన్స్ జై కొడుతారు. అది జరగకుండా సరైనా రిజల్ట్ రాకుంటే మాత్రం చెప్పులతో కొడుతారని క్రిటిక్స్ అంటున్నారు. సో… ఏజెంట్ లాంటి మూవీ కాకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని ప్రసన్నం చేసుకునేలా మూవీ చేస్తే సురేందర్ రెడ్డికి, ఆయన కెరీర్‌కి బెస్ట్.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు