Sree Leela: శ్రీలీలకి బుద్ధొచ్చింది – ముసలోడితో ఎందుకని బ్యాక్ స్టెప్..!

Sree Leela

టాలీవుడ్లో ప్రస్తుతం సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేకుండా అందరికీ ఫస్ట్ ప్రయారిటీగా మారింది. ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యి వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి కూడా శ్రీలీల ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఇదిలా ఉండగా, ధమాకా సినిమా ద్వారా రవితేజకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది.

మైత్రి మూవీస్, రవితేజ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం మేకర్స్ శ్రీలీలను అప్రోచ్ అవ్వగా మొదట ఒకే చెప్పి ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో కానీ, నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఉంది కాబట్టి డేట్స్ అడ్జస్ట్ అవ్వక పోవటంతోనే రవితేజ సినిమా రిజెక్ట్ చేసిందని అంటున్నప్పటికీ రవితేజ సీనియర్ హీరో కాబట్టే అతనితో యాక్ట్ చేయటం ఇష్టం లేక ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిందని కామెంట్స్ వస్తున్నాయి.

ఏదేమైనా, ధమాకా సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన రవితేజ సినిమాను రిజెక్ట్ చేయటం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ శ్రీలీలపై ఫైర్ అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ లాంటి యంగ్ హీరో నుండి మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తున్న శ్రీలీలకి ఒక్క రవితేజ విషయంలోనే ఏజ్ ఫ్యాక్టర్ కనపడిందా అని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి, నిజంగానే డేట్స్ ఇష్యూ వల్ల రిజెక్ట్ చేసిందా లేక ఏజ్ ఫ్యాక్టర్ వల్ల రిజెక్ట్ చేసిందా అన్నది తెలియాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు